
నర్సాపూర్ (జి) వెలుగు: నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం రోజు ఎక్స్ రే సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న 30 పడకల హాస్పిటల్‌ను గత ప్రభుత్వం 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించినా ఆచరణలో చేపట్టలేకపోయిందన్నారు. కనీస వసతులు, సిబ్బంది కొరత సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డాక్టర్ రామచంద్ర రెడ్డి, అధ్యక్షుడు బర్కుంటా నరేందర్, మిట్టపల్లి రాజేందర్, వైద్య సిబ్బంది బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.