
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా అభివృద్ధి కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని రాజేంద్రనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సాయికిరణ్ ఎండో క్రైన్, గ్యాస్ర్టో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో అన్ని రకాల ఆధునాతన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ బెక్కరి అనిత, టీపీసీసీ నాయకుడు వినోద్ కుమార్, నాయకులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు సిరాజ్ ఖాద్రి, ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్లు సామేల్, ప్రవీణ్ కుమార్, చైతన్యరెడ్డి, సాయికిరణ్, తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..
నగరంలో పది నెలల క్రితం అలీస్ మార్ట్ వద్ద విద్యుత్ షాక్తో మృతి చెందిన హబీబ్ నగర్ కు చెందిన జహంగీర్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. విద్యుత్ శాఖ అధికారుల అంగీకారంతో మృతుడి కుటుంబానికి రూ.4.50 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం కాంగ్రెస్ మహిళా నాయకురాలు వెంకటలక్ష్మి భర్త ఎస్.వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు అజ్మత్ అలీ, మాజీ కౌనిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.