
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని, ఆయన కుటుంబానికి సహాయ సహకారాలు అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి మల్సూర్ ఫ్యామిలీకి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. తాను కూడా వ్యక్తిగతంగా ఉప్పల మల్సూర్‌కు అభిమాని అని, అలాంటి నాయకుడికి తన వంతుగా సహకారాలు అందిస్తానని చెప్పారు.