ఎమ్మెల్సీ రిజల్ట్ నేడే

ఎమ్మెల్సీ రిజల్ట్ నేడే

ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ విజయం

ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ రెడ్డి గెలుపొందారు. ఈయనకు 742 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి 75 ఓట్లు పోలయ్యాయి. కాగా.. చెల్లని ఓట్లుగా 45 ఓట్లు రావడం గమనార్హం.

కరీంనగర్ లో ఆధిక్యం దిశగా టీఆర్ఎస్ అభ్యర్థులు

కరీంనగర్ లో టీఆర్ఎస్ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలకు పోటీచేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు భాను ప్రసాదరావ్, ఎల్. రమణ గెలుపుకు దగ్గర్లో ఉన్నారు. భాను ప్రసాద్ కు 500 ఓట్లు రాగా.. ఎల్. రమణకు 450 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు 175 ఓట్లు పోలయ్యాయి.

మెదక్ లోనూ టీఆర్ఎస్ దే విజయం

మెదక్ లోనూ టీఆర్ఎస్ గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి 524 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 1018 ఓట్లు పోలవ్వగా..  యాదవరెడ్డికి 762 ఓట్లు, నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి 2 ఓట్లు రాగా.. 12 ఓట్లు చెల్లిని ఓట్లుగా నమోదయ్యాయి.

రెండు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం

ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ రావు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి 486 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 239 ఓట్లు పోలయ్యాయి.

నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి  917 ఓట్లు రాగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి నగేష్ కు 226 ఓట్లు పోలయ్యాయి. నల్గొండలో 1271 ఓట్లకు గాను 1233 ఓట్లు నమోదయ్యాయి. వీటిలో 1183 చెల్లుబాటు కాగా.. 50 ఓట్లు చెల్లని ఓట్లుగా తేలాయి. అభ్యర్థి గెలుపుకు 593 ఓట్లు అవసరం కాగా.. కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ముందుగా చెల్లని ఓట్ల గుర్తింపు
ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మొదటగా చెల్లని ఓట్లను గుర్తించనున్నారు. ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. దీని ద్వారా ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.

ఎన్నికల సిబ్బందికి, పోలింగ్ ఏంజెంట్లకు మధ్య వాగ్వాదం
కరీంనగర్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల సిబ్బందికి, పోలింగ్ ఏంజెంట్లకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. పోలింగ్ ఏజెంట్లు పీపీఈ కిట్లు ధరించి లోపలికి వెళ్లాలని అధికారులు సూచించారు. దాంతో పోలింగ్ ఏజెంట్లు.. మీరు ధరించకుండా మమ్మల్ని ధరించమనడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏజెంట్లు తప్పకుండా పీపీఈ కిట్లు ధరించాలని తెలపడంతో.. పోలింగ్ ఏజెంట్లు పీపీఈ కిట్లు ధరించి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు.

ఆరు సీట్లలో తేలనున్న భవితవ్యం

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలై మధ్యాహ్నానికల్లా ఫలితాలు వస్తాయి. కౌంటింగ్ కు ఆదిలాబాద్ లో 6, నల్గొండలో 5, మెదక్ లో 5, ఖమ్మంలో 5, కరీంనగర్ లో 9 టేబుళ్లు ఏర్పాటు చేశారు.  బ్యాలెట్ పేపర్లను మొదట 25 చొప్పున కట్టలుగా కట్టి తర్వాత లెక్కిస్తారు. ముందు ఫస్ట్​ ప్రయారిటీ ఓట్లు లెక్కిస్తారు. నల్గొండ, మెదక్ జిల్లాల్లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయని సీఈఓ శశాంక్​ గోయల్​ తెలిపారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వారిని మాత్రమే ఏజెంట్లుగా అనుమతించనున్నారు. మొత్తం 12 ఎమ్మెల్సీ  స్థానాలకు గత నెల 9వ తేదీన షెడ్యూల్​ విడుదలైంది. ఇందులో ఆరుస్థానాలు ఏకగ్రీవమయ్యాయి.  మిగిలిన ఆరింటిలో ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలో రెండు, ఆదిలాబాద్‌‌, ఖమ్మం, నల్గొండ, మెదక్‌‌ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఈ నెల 10న పోలింగ్​ జరగగా 95 శాతం ఓటింగ్​ నమోదైంది. మూడు స్థానాల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఎదురైంది. ఆదిలాబాద్​, కరీంనగర్​, ఖమ్మం స్థానాల్లో  క్రాస్​ ఓటింగ్​ జరిగిందని అధికార పార్టీ భావిస్తోంది. ఫస్ట్​ ప్రయారిటీ వేయకుండా 2, 3 ప్రయారిటీ ఓట్లు వేసినా, అక్షరాలలో రాసినా లేదా క్రాస్ మార్కు, రైట్ టిక్కు మార్కు పెట్టినా ఓటు చెల్లుబాటు కాదు. ఆరు స్థానాలకు 26 మంది పోటీ చేశారు. కరీంనగర్​ లో రెండు స్థానాలకు 10 మంది, నల్లగొండ స్థానానికి ఏడుగురు, ఆదిలాబాద్​లో ఇద్దరు, ఖమ్మంలో నలుగురు,మెదక్​లో ముగ్గురు పోటీ పడ్డారు. వీరందరి భవితవ్యం సాయంత్రానికల్లా తేలిపోనుంది.