ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ షురూ..

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ షురూ..

రాష్ట్రంలో 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మరో 2, 3 గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆరు MLC స్థానాలకు ఈ నెల 10 న ఎన్నికలు జరిగాయి. మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండల్లో ఒక్కో సీటు ... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆదిలాబాద్ లో 6, నల్గొండలో 5, మెదక్ లో 5, ఖమ్మంలో 5, కరీంనగర్ లో 8 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ ఏజెంట్లను పీపీఈ కిట్లు వేసుకుంటేనే లోపలికి అనుమతించారు. విజయోజత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు CEO శశాంక్ గోయల్. గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే ధృవీకరణ పత్రం తీసుకునేందుకు వెళ్లాలని సూచించారు. 

ఉదయం 8 గంటలకు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేసి, అందులో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్ లను కౌంటింగ్ హాల్ కు తరలించారు. అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బ్యాక్సులను ఓపెన్ చేశారు. 25 చొప్పున బండిల్స్ కట్టి, వాటిని టేబుల్స్ మీద ఉంచుతున్నారు. మొదట ఫస్ట్ ప్రయార్టీ ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో లెక్కింపులో గెలుపు కోటా చేరుకున్న అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఏ అభ్యర్ధికి ఫస్ట్ ప్రయార్టీ కోటా ఓట్లు రాకపోతే .... అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ ఓట్లను లెక్కిస్తారు. ఇలా చివరగా మిగిలిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.