MLC ఎన్నికలు: 10 లక్షల 36 వేల మంది ఓటర్లు

MLC ఎన్నికలు: 10 లక్షల 36 వేల మంది ఓటర్లు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు జిల్లాలు కీలకంగా మారాయి. హైదరాబాద్రంగారెడ్డి మహబూబ్ నగర్, వరంగల్నల్గొండఖమ్మం ఎమ్మెల్సీ సెగ్మెంట్లలో మొత్తం 21 జిల్లాలుండగా.. వాటిలో ఏడు జిల్లాల్లోనే 66.73 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో హైదరాబాద్ సెగ్మెంట్ లో మూడు జిల్లాలు, వరంగల్ సెగ్మెంట్ లో నాలుగు జిల్లాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ అర్బన్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. రెండు సెగ్మెంట్లలో మొత్తం 10 లక్షల 36 వేల మంది ఓటర్లు ఉండగా.. ఈ ఏడు జిల్లాల్లోనే 6 లక్షల 91 వేల మంది ఓటర్లు ఉన్నారు. మిగిలిన 14 జిల్లాల్లో కేవలం 3 లక్షల 45 వేల మందే ఓటర్లు ఉన్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్యాండిడేట్లు ఈ ఏడు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ జిల్లాల్లో ఎక్కువ ఓట్లు రాబట్టుకోగలిగితే, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకే ఆయా జిల్లాల్లోని ఓటర్లకు ఫోన్లు చేస్తూ, SMSలు పంపిస్తున్నారు.

హైదరాబాద్ సెగ్మెం ట్ లో మొత్తం 9 జిల్లాలు ఉండగా.. 5లక్షల 31వేల ఓటర్లు ఉన్నారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనే 3లక్షల 85వేల మంది ఓటర్లున్నారు. ఈ జిల్లాల్లో ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. ఇక వరంగల్ సెగ్మెంట్ లో 12 జిల్లాలు ఉండగా.. 5లక్షల 5వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో నల్గొండ, సూర్యాపేట, వరంగల్ అర్బన్, ఖమ్మం జిల్లాల్లోనే 3 లక్షల 6వేల మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఈ జిల్లాల్లో నే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. యూనివర్సిటీలు కూడా ఈ జిల్లాల్లోనే ఉండడంతో గ్రాడ్యుయేట్ స్టూడెంట్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.