తెలంగాణలో ఎల్లుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలంగాణలో ఎల్లుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 10న జరుగనున్న 6 స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్ల పై ఆయా జిల్లాల కలెక్టర్ లు,ఎస్పీలు,సిపి లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఈఓ శశాంక్  గోయల్. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్ లు, శాంతి భద్రతలు, పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా తదితర అంశాలపై  ఈ సమావేశంలో చర్చించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ, వసతులపై అధికారులతో  సీఈవో శశాంక్ గోయల్ చర్చించారు. కోవిడ్  నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశానుసారం, ఆరు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఎన్నికలు జరగనున్నఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి 10.12.2021 సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయనున్నారు. ఆరు జిల్లాల పరిధి లోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేస్తామని అధికారులు తెలిపారు. డిసెంబర్ 10 ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హైదరాబాాద్ చేరుకున్నారు.