హైదరాబాద్ లో పూర్తైన ఏడో రౌండ్ కౌంటింగ్

హైదరాబాద్ లో పూర్తైన ఏడో రౌండ్ కౌంటింగ్

హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో ఏ ఒక్క అభ్యర్థి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. దీంతో.. సెకండ్  ప్రయారిటీ ఓట్లు లెక్కింపు  కొనసాగుతోంది. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు 30మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ అయిన వాళ్ల బ్యాలెట్లను లీడ్ లో ఉన్న అభ్యర్థులకు బదిలీ చేస్తున్నారు. ఎలిమినేట్ అయిన అభ్యర్థి బ్యాలెట్ లో ప్రయారిటీ ఓటును లెక్కలోకి తీసుకుంటారు. 

మొత్తం ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగింది. ఏడు రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి లక్షా 12 వేల  689 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు లక్షా 4 వేల 668 ఓట్లు వచ్చాయి. ఇండింపెండెంట్  అభ్యర్థి  ప్రొఫెసర్ నాగేశ్వర్ కు  53 వేల 610 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి  చిన్నారెడ్డికి  31 వేల 554 ఓట్లు వచ్చాయి. అటు  టీడీపీ అభ్యర్థి  ఎల్ రమణకు  5 వేల 973 ఓట్లు రాగా... స్వతంత్ర అభ్యర్థి హర్షవర్థన్ రెడ్డికి  9 వేల 783 ఓట్లు వచ్చాయి. 21 వేల 309 చెల్లని ఓట్లు నమోదు అయ్యాయి.