వచ్చే ఎన్నికల్లో పోటీపై.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో పోటీపై.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్

ఎన్నికల్లో పోటీ చేయాలంటే ధైర్యం కావాలి.. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కమెంట్స్ చేశారు. ఆగస్టు 20 ఆదివారం జగిత్యాల పట్టణంలోని బట్టి వాడలో జీవన్ రెడ్డి పర్యటించారు. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో జగిత్యాల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరని కాబట్టి ఆ బాధ్యత తనపై పడే అవకాశం ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. 

ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదని.. అయితే పార్టీ హైకమాండ్ ఆ బాధ్యత తనపై పెడుతుందని అనిపిస్తున్నట్లుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టే పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడం తప్పనిసరి అవుతుందని ఆయన చెప్పారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో జగిత్యాల అభివృద్ధికి కృషి చేశానన్నారయన. మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే జగిత్యాల ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. తాను ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఇంతకాలం ప్రజల మధ్యనే ఉన్నానని ఇకముందు కూడా అలాగే ఉంటానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.