అబద్ధపు హామీలతో ప్రతిపక్షాలు ప్రజల్ని మోసం చేస్తున్నయ్: ఎమ్మెల్సీ కవిత

అబద్ధపు హామీలతో ప్రతిపక్షాలు ప్రజల్ని మోసం చేస్తున్నయ్: ఎమ్మెల్సీ కవిత

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని అలవికాని హామీలు ఇస్తూ ప్రతిపక్షాలు పబ్లిక్ ని మోసం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆగస్టు 28న ఆమె కామారెడ్డి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

సమాజంలో పేద వర్గాలు ఇంకా ఉన్నారంటే కారణం కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథాకాల్ని కాపీ కొడుతూ కాంగ్రెస్ డిక్లరేషన్ లు ప్రకటిస్తోందని ఆరోపించారు. 

ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నంబర్ 1గా ఉన్న తెలంగాణ.. చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినా ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేకపోతోందని అన్నారు. 

దళితులపై ఎక్కడాలేని ప్రేమ కురిపిస్తూ వారిని మోసం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు.  ఈ సందర్భంగా కవిత బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మోటార్లకు మీటర్లు పెడతామన్న పార్టీని రాష్ట్రం నుంచి తరిమేయాలని ప్రజలను కోరారు. 

ఖమ్మంలో కేంద్ర మంత్రి అమిత్ షా పెట్టిన సభ ఎందుకో ఆ పార్టీ నేతలకే తెలియదన్నారు. కాంగ్రెస్, బీజేపీలలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. కామారెడ్డి బరిలో ఈ సారి కేసీఆర్ దిగుతున్నారని ఆయనను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.