ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ కవిత

ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ కవిత

బీజేపీ నేతలు రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈడీ, ఐటీ దాడులతో తెలంగాణ మంత్రులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, ఐటీ దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేశారని ఆరోపించారు. ప్రజలను నమ్మించేందుకు సభలు పెట్టి ఏడుస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేటలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. 

బీఎల్ సంతోష్ పై కేసులు పెడితే విచారణ చేయవద్దని కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తప్పు చేయకపోతే విచారణకు హాజరయ్యేందుకు బీజేపీ నేతలకు భయం ఎందుకని ప్రశ్నించారు. రాజకీయంగా గట్టిగా ఉన్న తమ పార్టీ నేతలను బెదిరించి కొనుకుంటున్నారని ఆరోపించారు. రాముడు పేరు చెప్పి రౌడీయిజం చేయడం బీజేపీకి అలవాటేనని కవిత విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీపైనా ఆమె ఆరోపణలు చేశారు. అసలు రాహుల్ గాంధీ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.