
నిజామాబాద్, వెలుగు: నగరంలోని చారిత్రక ఖిల్లా రామాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ కవిత పూజలు చేశారు. దసరా పండగ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆమె పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. సీఎంగా మరోసారి కేసీఆర్ ఎన్నికై ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆమె వెంట అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.