
సినీ ఇండస్ట్రీ అలాగే ఫ్యాషన్ ప్రపంచ రంగంలో ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిలదొక్కుకున్నవాళ్ళు కొందరికి రోల్ మోడల్ కావొచ్చు. అయితే ఇదే సినీ, ఫ్యాషన్ ఇండస్ట్రీలో అందరికి కనిపించని ఎన్నో ఉన్నాయి. కొన్ని వివాదంతో వెలుగులోకి వస్తే మరికొన్ని అంతుచిక్కని ప్రశ్నలాగే మిగిలిపోతున్నాయి. ఇందులోకి అడుగుపెట్టిన వారు తమను తాము నిరూపించుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదురుకోవాల్సి వస్తుంది. ఒకోసారి అలంటి సమయంలో చెప్పుకొలేని ఆర్ధిక పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. దింతో క్షణికావేశంలోనో లేక దుఃఖంలోనో లేదా ఒత్తిడితోనో ప్రాణాలను వదులుకుంటుంటారు. పుదుచ్చేరిలో ఓ మోడల్ ఆత్మహత్య ఇవన్నీ ఆలోచించేలా చేస్తుంది.
ప్రముఖ మోడల్, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ శాన్ రీచల్ గాంధీ నిన్న ఆదివారం పుదుచ్చేరిలో ఆత్మహత్య చేసుకున్నారు. 26 ఏళ్ల శాన్ రీచల్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా తన బలమైన గొంతుకి పేరుగాంచింది. ఆమె
మోడలింగ్, సినిమా రంగాల్లో ఉండే చర్మ రంగు వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడేవారు. కొంతకాలం క్రితమే ఆమె పెళ్లి కూడా చేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, శాన్ రీచల్ మోతాదుకు మించి ఎక్కువగా మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దొంతో ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగ, అక్కడి నుంచి ఒక ప్రైవేటు ఆసుపత్రికి, ఆ తర్వాత జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER)కి తరలించారు. కానీ ఆమె అప్పటికే ప్రాణాలు విడిచారు. తీవ్రమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
శాన్ రీచల్ గాంధీ ఎవరు: శాన్ రీచల్ గాంధీ చాలా చిన్న వయసులోనే మోడలింగ్ ప్రారంభించింది. ఆమె మద్రాస్ క్వీన్ (2022), మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు (2019), మిస్ బెస్ట్ యాటిట్యూడ్ (2019)గా నిలిచింది. ఇంకా 2022లో మిస్ పాండిచ్చేరి కిరీటాన్ని కూడా గెలుచుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 180K ఫాలోవర్స్ ఉన్న శాన్ రీచల్ గాంధీ ఒక ప్రొఫెషనల్ కోచ్ కూడా. సోషల్ మీడియాలో అలాగే శాన్ రీచల్ ఫ్యాషన్ వ్యాపారంలో ముదురు రంగు చర్మం ఉన్న మోడళ్ల వాడకాన్ని ప్రోత్సహించింది. ఎంటర్టైన్మెంట్ రంగంలో చర్మ రంగు గురించి అపోహలను తొలగించడంలో ఆమె ఎంతో కృషి చేసింది ఇంకా ఆమె అంటి-కలరిజం అభిప్రాయాలకు ప్రసిద్ధి.
భారతీయ ఫ్యాషన్, సినీ పరిశ్రమలో ముదురు చర్మ రంగుపై లోతుగా పాతుకుపోయిన అపోహలను వ్యతిరేకిస్తూ తన కష్టం ద్వారా శాన్ రీచల్ మోడలింగ్ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. నల్లటి చర్మం ఉన్న వారు, ముఖ్యంగా మహిళలు ఎదురుకొంటున్న సమస్యలకి వ్యతిరేకంగా ఆమె మాట్లాడారు.
శాన్ రీచల్ ఎందుకు చనిపోయిందంటే : ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు శాన్ రీచల్ తన తండ్రి ఇంటికి వెళ్లి ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో కొంత డబ్బు అడిగినట్లు తెలుస్తోంది. తన కొడుకు పట్ల తనకు బాధ్యతలు ఉన్నాయని చెబుతూ అతను ఆమెకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడని ఆరోపణలు ఉన్నాయి. పుదుచ్చేరికి చెందిన ఈ మోడల్ తన మరణానికి ముందు తన కెరీర్ కోసం తన ఆభరణాలను కూడా అమ్మేసింది, కానీ అది సరిపోలేదు ఇంకా ఆమె చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.
శాన్ రీచల్ తన మరణానికి ఎవరూ కారణం కాదని ఒక సూసైడ్ నోట్ రాసి ఉంచింది. అయితే, ఆమె మరణం మానసిక ఆరోగ్యం, సినీ పరిశ్రమ అలాగే ఫ్యాషన్ ప్రపంచం డిమాండ్లు, ముదురు చెర్మం పై ఉన్న నెగటివ్ ఆలోచనలు గురించి ఆన్‌లైన్ చర్చలకు దారితీసింది.