
దర్భంగా: దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే కులగణనకు ప్రధాని నరేంద్ర మోదీ ఒప్పుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ‘శిక్షా న్యాయ్ సంవాద్’ కార్యక్రమంలో భాగంగా గురువారం బిహార్ లోని మిథిలా యూనివర్సిటీ అంబేద్కర్ హాస్టల్ లో విద్యార్థులతో రాహుల్ ఇంటరాక్ట్ అయ్యారు. ఎవ్వరైనా రాజ్యాంగానికి తల వంచాల్సిందేనని, మోదీ కూడా అదే చేశారన్నారు. తాము చేసిన కులగణన డిమాండ్ కూ ప్రధాని ఒప్పుకోక తప్పలేదన్నారు. కాగా, అంతకుముందు రాహుల్ ఈ కార్యక్రమానికి వచ్చేందుకు అధికారులు అనుమతించకపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో రాహుల్ కారు దిగి నడుచుకుంటూ హాస్టల్ కు వెళ్లారు.