
వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ఇవాళ ఢిల్లీలో అన్ని పార్టీల అధ్యక్షులతో పార్లమెంట్ లో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ సమావేశానికి జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, శిరోమణి అకాళీదళ్ నుంచి సుఖ్ బీర్ సింగ్ బాదల్, BJD చీఫ్ నవీన్ పట్నాయక్, PDP నుంచి మెహబూబా ముఫ్తీ, వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ జగన్మోహన్ రెడ్డి, ఇతర పార్టీల నేతలు కేంద్రమంత్రులు.. హాజరయ్యారు. అయితే.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఈ సమావేశానికి హాజరుకాలేదు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు బదులుగా.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మీటింగ్ కు హాజరయ్యారు.
All-party meeting over 'One Nation, One Election' begins at Parliament
Read @ANI story | https://t.co/qgVueNFHqL pic.twitter.com/6jIDqN5Iyr
— ANI Digital (@ani_digital) June 19, 2019