
- దత్తాత్రేయ మనువరాలికి మోదీ అభినందన
- ప్రధానిని ప్రశంసిస్తూ జశోధర పద్యం
హైదరాబాద్, వెలుగు : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనువరాలు జశోధర తనను ప్రశంసిస్తూ పద్యం చెప్పడంతో ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. "ఆమె మాటలు గొప్ప శక్తికి మూలం" అని ప్రధాని ఆదివారం ట్వీట్ చేశారు. ప్రధానిని ప్రశంసిస్తూ జశోధర ఒక పద్యం పఠించారు. అందుకు సంబంధించిన వీడియోను హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ప్రధాని స్పందించారు. “సృజనాత్మకం, ఆరాధనీయమైనది. ఆమె మాటలు కూడా గొప్ప శక్తికి మూలం” అని మోదీ పేర్కొన్నారు.