5 ఐకానిక్​ సిటీలను డెవలప్​ చేస్తామని కేంద్రం ప్రకటన..

5 ఐకానిక్​ సిటీలను డెవలప్​ చేస్తామని కేంద్రం ప్రకటన..

టూరిజానికి 2,500 కోట్లు..
కల్చరల్​ శాఖకు 3,150 కోట్లు

    హెరిటేజ్, కన్జర్వేషన్ స్టడీస్​కు డీమ్డ్ యూనివర్సిటీ  

    ఓల్డెస్ట్​ మ్యూజియాల పునరుద్ధరణ

     కేంద్రబడ్జెట్ లో ప్రకటించిన ఆర్థిక మంత్రి

మినిస్ట్రీ ఆఫ్​కల్చర్ ఆధ్వర్యంలో హెరిటేజ్, కల్చర్ స్టడీస్ కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్​లో ప్రతిపాదించారు. ఈ ఇనిస్టిట్యూట్​కు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇవ్వనున్నారు.హర్యానాలోని రాఖిగఢీ, యూపీలోని హస్తినాపూర్, అస్సాంలోని శివ సాగర్, గుజరాత్ లోని ధోలావీరా, తమిళనాడులోని అడిచానళ్లూర్ సైట్లను ఐకానిక్ సైట్లు (ఆన్–సైట్ మ్యూజియాలు)గా డెవలప్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక కేంద్ర బడ్జెట్​లో టూరిజం, కల్చర్ మినిస్ట్రీలకు నిధు ల పెంపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొనసాగించారు. గత బడ్జెట్​తో పోలిస్తే.. టూరిజం మినిస్ట్రీకి రూ. 311 కోట్లు, కల్చర్ మినిస్ట్రీకి రూ.105 కోట్లు ఎక్కువగా కేటాయించారు. టూరిజం మినిస్ట్రీకి 2018–19 బడ్జెట్​లో రూ. 2,150 కోట్లు కేటాయించగా, 2019–2020 బడ్జెట్ లో రూ. 2,189.22 కోట్లకు స్వల్పంగా పెంచారు. తాజాగా 2020–21 బడ్జెట్ లో మరో రూ.311 కోట్లు పెంచి రూ. 2,500  కోట్లు అలాట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్​కల్చర్ కు 2018–-19 బడ్జెట్ లో రూ. 2,843.32 కోట్లు అలాకేట్ చేయగా, 2019-–2020 బడ్జెట్ లో రూ. 3,042.35 కోట్లు కేటాయించారు. తాజాగా 2020–-21 బడ్జెట్ లో  రూ. 3,150 కోట్లు కేటాయించారు.

టూరిజం రెవెన్యూ 1.88 లక్షల కోట్లు

‘‘వరల్డ్ ఎకానమిక్ ఫోరం విడుదలచేసే ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటీటివ్ నెస్ ఇండెక్స్ లో ఇండియా 2014లో 65వ ర్యాంకులో ఉండగా, 2019లో 34కు మెరుగుపడింది. దీంతో టూరిజం రెవెన్యూ కూడా గణనీయంగా పెరిగింది” అని ఆర్థిక మంత్రి చెప్పారు. దీనివల్ల 2019 జనవరి నాటికి మనదేశ ఫారిన్ ఎక్చేంజ్ ఎర్నింగ్స్ రూ.1.88 లక్షల కోట్ల(7.4% ఎక్కువ)కు పెరిగిందని తెలిపారు.

 ఓల్డ్ మ్యూజియాలకు క్యూరేషన్

‘‘మ్యూజియాలజీ, ఆర్కియాలజీ సమాచారం సేకర ణ, సైంటిఫిక్ అనలైజింగ్ కోసం వీటికి సంబంధించిన నాలెడ్జ్ ఉండటం అత్యవసరం” అని ఆర్థిక మంత్రి చెప్పారు. పోయిన నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మేరకు దేశంలోని ఓల్డెస్ట్ మ్యూజియాల రీ క్యూరేషన్ కు కూడా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అలాగే జార్ఖండ్ లో ట్రైబల్ మ్యూజియ ఏర్పాటుకు కూడా మంత్రి ప్రతిపాదించారు.

టూరిజానికి జోష్​

టూరిజానికి 2,500 కోట్లు కేటాయించడం, ఇతర నిర్ణయాలు దేశంలో పర్యాటకానికి ఊతమిస్తాయని ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు. హెరిటేజ్, కన్జర్వేషన్ యూనివర్సిటీ ఏర్పాటు దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని ‘థామస్ కుక్’ చైర్మన్ మాధవన్ మీనన్ అన్నారు.

  1. రాఖిగఢీ: హర్యానాలోని హిసార్​ జిల్లా పరిధిలోకి వచ్చే గ్రామం. ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం సుమారు 6,500 నాటి సింధు లోయ నాగరికత కన్నా ముందు నుంచీ ఉందని, క్రీస్తు పూర్వం 2600-–1900 నాటి మెచ్యూర్​ ఇండస్​ వ్యాలీ సివిలైజేషన్​ వరకు మనుగడలో ఉందని ఆర్కియాలజిస్టులు లెక్క కట్టారు. దీన్ని సింధు నాగరికత కలిగిన స్థలాలన్నింటిలోనూ పెద్దదిగా చెబుతారు. సుమారు 900 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఊరు… ప్రపంచవ్యాప్తంగా ఆర్కియాలజిస్ట్​ల దృష్టిని ఆకర్షిస్తోంది.
  2. హస్తినాపూర్: యూపీలోని మీరట్​ జిల్లా పరిధిలోకి వచ్చే సిటీ. ఈ నగరం ప్రస్తావన మహాభారతంతోపాటు ఇతర పురాణాల్లో ఉంది. కురు వంశీయుల రాజధాని. మహాభారతంలోని చా లా ఘటనలు హస్తినాపురంలోనే జరిగాయి. ఆర్కియాలజిస్టులు ఈమధ్య చేపట్టిన తవ్వకా ల్లో.. రథాలు, కత్తులు, కిరీటాలు వంటి పురాతన ఆనవాళ్లు బయటపడ్డాయి. వాటిపై అప్పటి కల్చరల్​ అంశాలు కూడా చెక్కి ఉండటం విశేషం.
  3. ధోలావీరా: గుజరాత్​లోని కచ్​ జిల్లా పరిధిలోకి వచ్చే భచావ్​ తాలూకాకి చెందిన చారిత్రక ప్రాంతం. ఈ ఏరియాని లోకల్​గా ‘కొటాడ టింబా’ అంటారు. ఇక్కడ ఎక్కువగా పురాతన సింధూ లోయ నాగరికత శిథిలాలు, ఆనవాళ్లు కనిపిస్తాయి. హరప్పా నాగరికతకు సంబంధించిన 8 అతి పెద్ద సైట్లలో ఇది ఐదోది. ఈ స్థలానికి దక్షిణాన కిలోమీటర్​ దూరంలో ధోలావీర అనే గ్రామం ఉండటంతో ఈ సైట్​నీ ఆ పేరుతోనే పిలుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని 1967––1968లో ఆర్కియాలజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా డైరెక్టర్​ జనరల్ జె.పి.జోషి కనుగొన్నారు.
  4. అడిచానల్లూర్: తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా పరిధిలోకి వచ్చే చారిత్రక ప్రదేశం. పురాతన కాలానికి చెందిన అనేక ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి మనుషుల అస్థిపంజరాలు. ఆ అస్థికలు, చితాభస్మం గల మట్టి పాత్రలు కూడా ఇక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇవి కనీసం 3,800 ఏళ్ల కిందటివని చెబుతుంటారు. ఈ అస్థిపంజరాలు తమిళియన్లు, ఆస్ట్రలాయిడ్లు, తూర్పు ఆసి యన్, ఈస్ట్​ ఏసియన్, మిడిల్ ఈస్టర్న్, మధ్యధరా మూలాలు కలిగినవని అంటున్నారు.

4.శివ సాగర్: అస్సాంలోని ఒక ప్రధానమైన సిటీ. శివ సాగర్ జిల్లాకి కేంద్రం కూడా. సిటీ నడిబొడ్డున శివ సాగర్ సరస్సు ఉండటంతో ఆ పేరుతోనే పిలుస్తున్నారు. మధ్య యుగంలో అస్సాంను అహోమ్​లు 600 ఏళ్లు పాలించారు. ఈ నగరం అహోమ్​ల సామ్రాజ్యానికి 1699–-1788 మధ్య కాలంలో రాజధానిగా ఉండేది. ఈ రీజియన్​లో ప్రస్తుతం ఉన్న వివిధ ఆర్కియాలజికల్​ సైట్లలో నాటి కట్టడాలు, కళా ఖండాలు అడుగడుగునా కనిపిస్తాయి. రాజుల కోట ‘తలాతల్ ఘర్’, వినోదాన్ని పంచే ‘రంగ్ ఘర్’ వీటిలో ముఖ్యమైనవి.