
కేంద్ర ప్రభుత్వం మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లను ఖరారు చేసింది. OBC-27%, EWS-10% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ రిజర్వేషన్లు UG (MBBS,BDS),PG, డెంటల్ మెడికల్ కోర్సులకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ అకాడమిక్ ఇయర్ (2021-22) నుంచే ఇవి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయస్థాయి కోటా విభాగంలో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లేటెస్టు నిర్ణయం ద్వారా MBBSలో ప్రతి ఏడాది 1500 విద్యార్థులు, PGలో 2500 మంది OBC విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా EWS విభాగంలో 550 MBBS విద్యార్థులు,PGలో వెయ్యి మందికి అవకాశం లభిస్తుందని చెప్పింది.