నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ప్రధాని శంకుస్థాపన

నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ప్రధాని శంకుస్థాపన

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రధాన మంత్రి ఇవాళ(గురువారం) శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్ లోని గౌతమ బుద్ధనగర్  జిల్లా జెవెర్ ప్రాంతంలో నిర్మించనున్న నోయిడా ఇంటర్నేషనల్   ఎయిర్ పోర్టుకు ప్రధాని గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌరు విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నిర్మాణం పూర్తయితే  ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్ పోర్టుగా నిలవనుంది.

రూ.10,500 కోట్లతో మొదటి దశ విమానాశ్రయ నిర్మాణం మొదలు కానుంది. ఈ ప్రాజెక్టు అన్ని దశలు పూర్తిచేసుకునే సరికి రూ. 35 వేల కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. నోయిడా నుంచి 40 కి.మీ.ల దూరంలో, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 72 కి.మీ.ల దూరంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1,300 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించనున్న నోయిడా ఎయిర్‌పోర్టును 2024 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.