చట్టం గురించి తెలుసుకోండి.. లేదంటే లాయర్ సలహా తీసుకోండి

చట్టం గురించి తెలుసుకోండి.. లేదంటే లాయర్ సలహా తీసుకోండి

భారతీయ ముస్లింలలో మోడీకి ఆదరణ ఎక్కడ పెరుగుతుందోనని కాంగ్రెస్ భయపడుతోందన్నారు మోడీ. అందుకే ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అరబ్, ఇతర ముస్లిం దేశాలతో గత ఐదేళ్లలో భారత్ సంబంధాలు మెరుగు అయ్యాయని మోడీ చెప్పారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన భారీ సభలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై మాట్లాడారు.

గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని  చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు మోడీ. మన్మోహన్ విజ్ఞప్తిని అమలు చేసినందుకు… తనను నిందిస్తారా..? అని ప్రశ్నించారు. అస్సాం మాజీ సీఎం తరుణ్ గోగోయ్ లెటర్ ను ప్రస్తావించారు. CAAను ఇప్పుడు వ్యతిరేకిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గతంలో చెప్పిన మాటలను గుర్తు చేశారు.

కొన్ని సంవత్సరాల క్రితం, బంగ్లాదేశ్ నుండి వస్తున్న చొరబాటుదారులను ఆపాలని ఆమె(మమతా) పార్లమెంటు ముందు విజ్ఞప్తి చేశారన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులపై పుకార్లు ఎందుకు వ్యాపింపచేస్తున్నారంటూ ప్రధాని ఆమెను ప్రశ్నించారు. ఎన్నికలనేవి వస్తాయి, పోతాయి. ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఇలా దిగజారాలా..? అని మమతను ప్రశ్నించారు. మమతా బెంగాలీ ప్రజలను శత్రువుల్లా భావిస్తున్నారని ఆరోపించారు.

CAAను అమలు చేయబోమని కొన్ని రాష్ట్రాలు చెప్పడాన్ని మోడీ తప్పుబట్టారు. చట్టం గురించి తెలుసుకోవాలని సూచించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారు అలా మాట్లాడకూడదని చెప్పారు. కావాలంటే అడ్వొకేట్ జనరల్ సలహ తీసుకోవాలన్నారు మోడీ.

MODI mocking advice: