
న్యూఢిల్లీ:కరోనా టైంలో మందులు, టీకాలు, వైద్య పరికరాలు ప్రాణాలు కాపాడేందుకు ఆయుధాలుగా మారాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హెల్త్ సెక్టార్ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని కూడా తగ్గించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు. ఆరోగ్య భారత్లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ‘హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్’ అంశంపై నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో మోడీ మాట్లాడారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక కొన్ని దశాబ్దాల పాటు హెల్త్ సెక్టార్‌ను పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకొచ్చాక ఈ రంగాన్ని హెల్త్ మినిస్ట్రీకే పరిమితంచేయలేదని, మొత్తం ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేశామని వివరించారు. ఇక్కడి పారిశ్రామికవేత్తలు స్వయంసమృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఎలాంటి టెక్నాలజీని కూడా విదేశాల నుంచి తెచ్చుకునే అవసరంలేకుండా చూసుకోవాలన్నారు.
కరోనా కారణంగా హెల్త్ సెక్టార్‌పైనే ఫోకస్
పోయిన ఏడాదికి ఇండియన్ ఫార్మా సెక్టార్ విలువ రూ.4 లక్షల కోట్లుగా ఉందని, ప్రైవేట్, మెడికల్ కాలేజీల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంటే దీన్ని రూ.10లక్షల కోట్లకు తీసుకెళ్లొచ్చని మోడీ అన్నారు. కరోనా కారణంగా సంపన్న దేశాలన్నీ హెల్త్ సెక్టార్‌పై ఫోకస్ పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ‘వన్ ఎర్త్.. వన్ హెల్త్’ నినాదాన్ని ప్రపంచానికి పరిచయం చేశామన్నారు. ‘‘తక్కువ ధరకు మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ స్కీం కింద రూ.80 వేల కోట్లు విలువ చేసే ట్రీట్మెంట్తో ప్రజలను కాపాడాం. ‘జన ఔషధి’ కేంద్రాలతో రూ.20 వేల కోట్లు ఆదా చేశాం. కరోనా టైంలో ప్రపంచానికి మన ఫార్మా సెక్టార్ మార్గదర్శిగా నిలిచింది” అని మోడీ అన్నారు.
ఇన్వెస్టర్స్‌కు మరిన్ని అవకాశాలు
స్ట్రాంగ్ హెల్త్ సెక్టార్ కోసం రెసిడెన్షియల్ ఏరియాల్లో 1.50 లక్షలకు పైగా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మోడీ వివరించారు. డయాబెటిస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను స్క్రీనింగ్ చేసేందుకు ఈ సెంటర్లు ఉపయోగపడ్తాయన్నారు. గడిచిన కొన్నేండ్లలోనే 260కిపైగా మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, 2014తో పోలిస్తే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో సీట్లు డబుల్ అయ్యాయని వివరించారు.
వైద్య వ్యవస్థలో టెక్నాలజీ ప్రధానం
మెడికల్ కాలేజీలకు దగ్గర్లోనే 157 కొత్త నర్సింగ్ కాలేజీలను ప్రారంభించడం మెడికల్ హ్యుమన్ రీసోర్సెస్‌కు కీలక ముందడుగు అని మోడీ అన్నారు. ఇవి దేశీయ అవసరాలకే కాకుండా గ్లోబల్ డిమాండ్‌ను నెరవేర్చడంలో ఉపయోగపడ్తాయని తెలిపారు. వైద్య వ్యవస్థలో టెక్నాలజీది కీలక పాత్ర అన్నారు. ఈ రంగంలో టెక్నాలజీని అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. గత కొన్నేండ్లలో మెడికల్ డివైజ్ సెక్టార్ 12 నుంచి 14% వృద్ధి సాధించిందని తెలిపారు.
ఆర్థిక ఎదుగుదలకు యూత్ కీలకం
అహ్మదాబాద్: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదగడానికి యువత ఎంతో కీలకమని ప్రధాని మోడీ అన్నారు. ఇండియా ఇప్పుడు ఐదో స్థానంలో ఉందని తెలిపారు. గాంధీనగర్‌లో రోజ్‌గార్ మేళా ప్రోగ్రాంలో వర్చువల్‌గా పాల్గొని మోడీ మాట్లాడారు. ఐదేండ్లలో గుజరాత్ ప్రభుత్వం 1.50లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. వివిధ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గుజరాత్‌లో గడిచిన కొన్నేండ్లలో దాదాపు 18 లక్షల మంది యువకులు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీల ద్వారా ఉద్యోగాలు పొందారని చెప్పారు.