ఇన్‌ఫ్రాకు 1 కోటి కోట్లు: మోడీ

ఇన్‌ఫ్రాకు 1 కోటి కోట్లు: మోడీ
  • 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తాం
  • సంస్కరణలను కొనసాగిస్తాం
  • రూల్స్‌‌ను ఈజీగా మారుస్తాం
  • ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన

న్యూఢిల్లీ : రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్‌‌‌‌పోర్టుల వంటి మోడర్న్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం రూ.వంద లక్షల కోట్లను వెచ్చించనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. రాబోయే అయిదేళ్లలో ఇండియా ఎకానమీని అయిదు ట్రిలియన్‌‌‌‌ డాలర్ల (మూడున్నర కోట్ల కోట్లు) సైజుకు చేర్చడానికి ఈ పెట్టుబడులు సాయపడతాయని తెలిపారు. ఎర్రకోట పైనుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ ప్రకటనలు చేశారు. ఈజ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ డూయింగ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌  ర్యాంకుల్లో ‘టాప్‌‌‌‌ 50’లో ఇండియా ఉండేలా సంస్కరణలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. 5 ట్రిలియన్‌‌‌‌ డాలర్లకు చేరాలంటే ప్రస్తుత సైజును రెట్టింపు చేయడమేనని, కొంత మందికి ఇది కష్టంగా కనిపించొచ్చని అభిప్రాయపడ్డారు. బీజేపీ మొదటి దఫా అయిదేళ్ల అధికారంలో ఇండియా ఎకానమీ ట్రిలియన్‌‌‌‌ డాలర్ల నుంచి 2 ట్రిలియన్‌‌‌‌ డాలర్లకు దూసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. స్థిరమైన ప్రభుత్వానికి ఓటు వేయడంతో పాలసీల కొనసాగింపుకు వీలు కలిగిందని, ఈ రెండు అంశాలు ఇండియా ఎదుగుదలకు మంచి అవకాశమిస్తున్నాయని మోడీ తెలిపారు.

ఆర్థిక ప్రగతికి అన్ని చర్యలు…

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూనే ఆర్థికంగా ముందడుగు వేసేందుకు తమ ప్రభుత్వం చొరవ తీసుకుంటోందన్నారు. గూడ్స్‌‌‌‌ అండ్‌‌‌‌ సర్వీసెస్ టాక్స్‌‌‌‌ (జీఎస్‌‌‌‌టీ), ఇన్‌‌‌‌సాల్వెన్సీ అండ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌రప్టసీ కోడ్‌‌‌‌ (ఐబీసీ)లు ఆర్థిక వృద్ధికి సాయపడటానికి ఉద్దేశించినవేనని చెప్పారు. మోడర్న్‌‌‌‌ పోర్టులు, హైవేలు, రైల్వేలు, ఎయిర్‌‌‌‌పోర్టులు, హాస్పిటళ్లు, ఎడ్యుకేషనల్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌ నెలకొల్పడానికి 100 లక్షల కోట్లను పెట్టుబడిగా ప్రభుత్వం పెడుతుందని తెలిపారు. విధానపరమైన పక్షవాతం (పాలసీ పెరాలిసిస్‌‌‌‌) గతమని, విధానాలను ఆధారంగా చేసుకుని మెరుగైన పాలన ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ‘వరల్డ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఈజ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ డూయింగ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌’ ఇండెక్స్‌‌‌‌లో 190 దేశాలుంటే, ఇండియా 142 వ ప్లేస్‌‌‌‌లో (2014 లో) ఉండేదని,  కిందటేడాది ఈ ర్యాంక్‌‌‌‌ను 77 కి తేగలిగామని వెల్లడించారు. సంస్కరణలు కొనసాగుతాయని, పాలన పద్ధతులను మరింత సులభతరం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇవన్నీ దేశాన్ని 5 ట్రిలియన్‌‌‌‌ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దేందుకేనని తెలిపారు. వరల్డ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఈజ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ డూయింగ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లో టాప్‌‌‌‌ 50 దేశాలలోకి చేరడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2017 లో ఇండియా ఈ ఇండెక్స్‌‌‌‌లో ఇరాన్‌‌‌‌, ఉగాండాల కంటే ఘోరమైన పొజిషన్‌‌‌‌ (130)లో ఉండేదని చెప్పారు. నాలుగేళ్ల సంస్కరణలతో 2018 లో ఈ పొజిషన్‌‌‌‌ను మెరుగుపరుచుకుని 100 వ ప్లేస్‌‌‌‌కు, ఆ తర్వాత 2019 లో 77 వ ప్లేస్‌‌‌‌కు రాగలిగామన్నారు.

సంపద సృష్టించే వారిపై  అనుమానం తగదు

సంపద సృష్టించే వారిని అనుమానంతో చూడడం తగదని నరేంద్ర మోడి అభిప్రాయపడ్డారు. ఈ మాటల ద్వారా ఇండియాలోని కార్పొరేట్లకు మద్దతుగా ప్రధాన మంత్రి నిలబడినట్లైంది. దేశానికి సంపద వారేనని, వారిపై సందేహాలుండకూడదని మోడి చెప్పారు. సంపద సృష్టించే వారిని ఎప్పుడూ అనుమానంతో చూడొద్దు. సంపద సృష్టిస్తేనే, దానిని పంపిణీ చేయడం వీలవుతుందని పేర్కొన్నారు. ఇండియాలో సంపద సృష్టించే వారిని దేశ సంపదగా మోడి అభివర్ణించారు. సంపద సృష్టి చాలా కీలకమైనదని మోడి తెలిపారు. ఈ విధంగా కార్పొరేట్ల పట్ల సానుకూల ధోరణిని ప్రధాన మంత్రి ప్రదర్శించడం  ఏడాది కాలంలో ఇది మూడోసారి కావడం విశేషం. పారిశ్రామికవేత్తలతో సన్నిహితంగా ఉండేందుకు తాను ఏమాత్రం భయపడనని, తన అంతరాత్మ స్పష్టంగా ఉందని కిందటేడాది జులైలో ప్రధాని వ్యాఖ్యానించారు. దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లడంలో పారిశ్రామికవేత్తలూ ముఖ్యపాత్ర పోషించారని పేర్కొన్నారు. పరిశ్రమ, కార్పొరేట్లను విమర్శించే సంస్కృతిని తాను విశ్వసించనని మోడి 2018 అక్టోబర్‌‌‌‌లో చెప్పారు. తమ వ్యాపారాలతోపాటు సమాజ సేవనూ వారు నిర్వహిస్తున్నారని మోడి పేర్కొన్నారు.