Modi US Visit: ఉగ్రవాదంతో పోరాటంలో ఎలాంటి ఉపేక్షలు ఉండవు : ప్రధాని మోదీ

Modi US Visit:  ఉగ్రవాదంతో  పోరాటంలో ఎలాంటి ఉపేక్షలు ఉండవు : ప్రధాని మోదీ

ఉగ్రవాదాన్ని "మానవత్వానికి శత్రువు" అని పిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ.. దానిపై పోరాటంలో ఎలాంటి ఉపేక్ష చూపబోమని అన్నారు. "ఉగ్రవాదం మానవాళికి శత్రువు, దానితో వ్యవహరించడంలో ఎలాంటి అపోహలు ఉండవు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, పాల్పడేటువంటి శక్తులన్నింటినీ మనం అధిగమించాలి" అని జూన్ 23న యుఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి US కాపిటల్ హిల్ లో ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి చెప్పారు.

"9/11 ఘటన జరిగి రెండు దశాబ్ధాలు అయింది. ముంబైయిలో 26/11 దుర్ఘటన జరిగి పదేళ్లు దాటింది. ఇప్పటికి కూడా ఉగ్రవాదం యావత్ ప్రపంచానికి ప్రమాదకరంగానే ఉంది" అని మోదీ అన్నారు. ఇదే భావజాలంతో చాలా సంస్థలు, చాలా వేదికలు ఉండవచ్చు. కానీ అందరి ఉద్దేశం మాత్రం ఒక్కటే. ఉగ్రవాదం మానవాళికి ప్రథమ శత్రువు. దీనిపై పోరాటం చేయడంలో అయితే, కానీ పదాలకు చోటు లేదు అని చెప్పారు.  మోదీ వ్యాఖ్యలు చేస్తున్ టైంలో ఛాంబర్స్‌లో కూర్చొని ఉన్న భారతీయులు అంతా మోదీ మోదీ అంటూ గట్టిగా నినాదాలు చేశారు.

నేను ప్రధానమంత్రిగా యుఎస్‌ని మొదటిసారి సందర్శించినప్పుడు, భారతదేశం ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. నేడు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. భారతదేశం త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. మనం ఎదగడమే కాకుండా రోజురోజుకూ అభివృద్ధి కూడా చెందుతున్నాము. భారతదేశం అభివృద్ధి చెందితే ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుంది" అని యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో పీఎం మోడీ వ్యాఖ్యానించారు.

https://twitter.com/PMOIndia/status/1671993520259846146