మైనారిటీలపై మోదీ పరోక్ష దాడులు

మైనారిటీలపై మోదీ పరోక్ష దాడులు
  •  సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి కామెంట్

హైదరాబాద్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ హిందూ సెంటిమెంటును రెచ్చగొట్టి ముస్లిం మైనారిటీలపై పరోక్ష దాడులకు పాల్పడుతున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాజస్థాన్ లోని బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

 రాజ్యాంగ విరుద్ధంగా, వ్యవస్థకు భంగం కలిగించే విధంగా ఆయన వ్యవహార శైలి ఉండటం ఎన్నికల ఎత్తుగడలో భాగమేనని అన్నారు. హిందువుల ఓట్లను రాబట్టుకోవడం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.