వైరాలో మోగా జాబ్​ మేళాకు అన్యూహ స్పందన 

వైరాలో మోగా జాబ్​ మేళాకు అన్యూహ స్పందన 

వైరా, వెలుగు : వైరాలో శనివారం నిర్వహించిన జాబ్​మేళాకు అన్యూహ స్పందన లభించింది. ఐదు వేలకు పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు ఈ మేళాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విరమార్క స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​ మాట్లాడుతూ జాబ్ మేళా కు దాదాపు 8 వేల మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5 వేల మందికి 80 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. ఇంటర్వ్యూలో ఎంపికైన యువతకు వివిధ కంపెనీల ఆఫర్ లెటర్ లను డిప్యూటీ సీఎం అందజేశారు.