షమీకి ఓటేయని భారత అభిమానులు.. ఐసీసీ అవార్డు ఆసీస్ వశం

షమీకి ఓటేయని భారత అభిమానులు.. ఐసీసీ అవార్డు ఆసీస్ వశం

భారతదేశ జనాభా 150 కోట్లు.. అదే ఆస్ట్రేలియా జనాభా దాదాపు 3 కోట్లు.. అంటే మన దేశ జనాభాతో పోలిస్తే 50 రేట్లు తక్కువ. అయినప్పటికీ ఆసీస్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఓటింగ్‌లో భారత క్రికెటర్ మహమ్మద్ షమీను వెనక్కునెట్టి ఐసీసీ అవార్డు సొంతం చేసుకున్నాడు. మందు, బిర్యానీ కోసం రాజకీయ నాయకులను ఎన్నుకునే మన పౌరులు, షమీ వాటిని ఇవ్వకపోయేసరికి ఓటేయడానికి ముందుకు రాలేదు. ఈ నిజాన్ని కాదని చెప్పలేం. లేదంటే ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని చేయి లేదు.. ఇంటర్నెట్ వాడని మనిషి లేరు. అలాంటిది 10 నిమిషాల సమయం కేటాయించి ఓటేయడానికి ఏంటి చెప్పండి.

భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లో అదరగొట్టిన ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ నవంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్ పోరులో ఆల్ రౌండ్ ప్రదర్శన(48 బంతుల్లో 62 పరుగులు, 2 వికెట్లు)తో అదరగొట్టిన హెడ్.. భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ(110 బంతుల్లో 137 పరుగులు)తో కదం తొక్కాడు. దీంతో ఐసీసీ అవార్డు అతని సొంతమైంది. ఈ అవార్డు రేసులో భారత బౌలర్ మహమ్మద్ షమీ ఉన్నప్పటికీ ఓటింగ్‌లో ముందున్న హెడ్‌నే ఐసీసీ అవార్డు వరించింది.

నహిదా అక్తర్

ఇక మహిళా క్రికెకెటర్లలో బంగ్లాదేశ్ స్పిన్ మాస్ట్రో నహిదా అక్తర్.. ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు  సొంతం చేసుకుంది.