పెళ్లికి అమ్మ కట్టిన చీర.. జాబితాలో చేరిపోయిన నిహారిక

పెళ్లికి అమ్మ కట్టిన చీర.. జాబితాలో చేరిపోయిన నిహారిక

అమ్మ చీరలతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి కూతుళ్లకి. అఫ్​కోర్స్​ కొడుకులకి కూడా. కాకపోతే కూతుళ్లకి మరికాస్త ఎక్కువగా ఉంటాయి. చీర కొంగు పట్టుకు తిరిగిన రోజులు, ఆడిన ఆటలు ఎప్పటికీ  మెమర​బుల్ డేసే వాళ్లకి. అమ్మ  భద్రంగా  ట్రంక్​ పెట్టెల్లో, బీరువాల్లో  దాచుకున్న పెళ్లి చీర తీసి చూపిస్తుంటే ప్రతీ కూతురు ఎమోషనల్​గా ఫీలవుతుంది. ఆ ఎమోషన్​ క్యారీ చేసేందుకు  అమ్మ పెళ్లప్పుడు కట్టుకున్న చీరలనే తమ పెళ్లి వేడుకల్లో  కట్టుకుంటున్నారు చాలామంది.

రీసెంట్​గా ఆ లిస్ట్​లో నిహారిక కూడా చేరిపోయింది… మెగా డాటర్​ నిహారిక ఈ నెల తొమ్మిదిన పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్​గా తన పెళ్లికూతురు ఫంక్షన్​ ఫొటోలని ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది.32 ఏళ్ల క్రితం తన తల్లి పెళ్లి వేడుకల్లో కట్టుకున్న చీరని కట్టుకుని అందర్నీ సర్​ప్రైజ్​ చేసింది.‘‘ఈ చీర మా అమ్మది’’ అంటూ ఓ క్యాప్షన్​ కూడా పెట్టింది.

కేవలం నిహారికే కాదు ఇంతకుముందు కూడా చాలామంది సెలబ్రిటీలు తమ పెళ్లిళ్లకి అమ్మల చీరలనే ఎంచుకున్నారు.  ముఖేష్​ అంబానీ గారాలపట్టి ఇషా కూడా తన తల్లి నీతూ అంబానీ పెళ్లి చీరనే తన పెళ్లి లెహంగాగా మార్చుకుంది. నీతా చీరని తన పెళ్లి లెహంగాలా డిజైన్​ చేయించుకుంది.

అలాగే బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సోనమ్​ కపూర్​ తల్లి పెళ్లి చీరని ఇన్​స్పిరేషన్​గా తీసుకుని స్పెషల్​గా డ్రెస్​ డిజైన్​ చేయించుకుంది. ఒక వేడుకలో శ్రద్ధాకపూర్​, జాన్వీకపూర్​లు కూడా మదర్స్​ శారీస్​తో అదరగొట్టారు. కేవలం అమ్మల చీరలే కాదు కొందరు సెలబ్రిటీలు అత్తల చీరల్ని కూడా పెళ్లి వేడుకలకి ఎంచుకుంటున్నారు.

తన పెళ్లిలో  కరీనా వేసుకున్న డ్రెస్​   అత్త షర్మిలా ఠాగూర్​​దే. గ్లోబల్ స్టార్​ ప్రియాంక చోప్రా కూడా మదర్​ ఇన్​ లా వెడ్డింగ్ అవుట్​ఫిట్​నే తన చర్చ్​ మ్యారేజ్​లో వేసుకుంది. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఈమధ్య అమ్మల చీరలతో డ్రెస్​లు కుట్టించుకుంటున్నారు.

రీసెంట్​గా బాలీవుడ్ యాక్టర్​ రితేశ్​ దేశ్​ముఖ్​ కూడా తన తల్లి చీరతో డిజైన్​ చేసిన డ్రెస్​లో మెరిశాడు.

 

 

 

 

 

 

 

 

for more News..