వలస కూలీ బిడ్డకు హాస్టల్​ఫీజు, అకడమిక్ ​బు క్స్​కొనేందుకు డబ్బులు ​లేవ్

వలస కూలీ బిడ్డకు హాస్టల్​ఫీజు, అకడమిక్ ​బు క్స్​కొనేందుకు డబ్బులు ​లేవ్
  • వలస కూలీ బిడ్డకు ఎంబీబీఎస్​ ఫ్రీ సీటు
  • హాస్టల్​ఫీజు, అకడమిక్​ బుక్స్​కొనేందుకు పైసల్​ లేవ్​

మహబూబ్​నగర్/హన్వాడ, వెలుగు: వలస కూలీ బిడ్డకు ఎంబీబీఎస్​ ఫ్రీ సీటు దక్కింది. కానీ హాస్టల్​ఫీజు, అకడమిక్ ​బు క్స్​కొనేందుకు డబ్బులు ​లేకపోవడంతో చదువు ఎక్కడ ఆగిపోతుందోనని ఆందోళనకు గురవుతోంది. మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ  మండలం కారంతండా గ్రామ పంచాయతీకి చెందిన సబావత్ ​శంకర్​నాయక్, శాంతిబాయి వలస కూలీలు. పుణెలో భవన నిర్మాణ కార్మికులుగా చేసేవారు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పిల్లలు తమలా కూలీలుగా మారొద్దని కష్టపడి చదివిస్తున్నారు. 2018లో శంకర్ ​అనారోగ్యానికి గురయ్యాడు. బోన్ ​క్యాన్సర్​తో చనిపోయాడు. శాంతిబాయి ప్రస్తుతం పుణెలో కొందరి ఇళ్లల్లో పాచి పని చేస్తోంది. నెలకు రూ.12 వేలు సంపాదిస్తోంది. ఇందులో రూ.10 వేలు పిల్లలకు పంపి రూ.2 వేలతో ఆమె సర్దుకుంటోంది. కొడుకులు రోహన్, రోహిత్​ హైదరాబాద్​లోని ఎస్టీ హాస్టల్​లో డిగ్రీ, ఇంటర్​ చదువుతున్నారు. ప్రీతి చిన్నాన్న ఇంట్లో ఉంటోంది.

ఏడాదికి రూ. 1.7 లక్షలు కావాలె

ప్రీతి ఫస్ట్​ నుంచి టెన్త్​ వరకు హైదరాబాద్​లోని ప్రైవేట్​ స్కూల్​లో చదివింది. తండ్రి చనిపోయేటప్పటికి టెన్త్​ చదువుతోంది. తర్వాత మహబూబాబాద్​లోని కురవి గురుకులంలో ఫ్రీ సీట్​సాధించి ఇంటర్​ పూర్తి చేసింది. అదే టైంలో నీట్ పరీక్ష రాయగా 189 మార్కులు వచ్చాయి. రెండోసారి రాజేంద్రనగర్ గురుకులంలో కోచింగ్​ తీసుకోగా 355 మార్కులు వచ్చాయి. గత ఏడాది ఇంట్లోనే ప్రిపేర్​అయ్యింది. ఇటీవల విడుదలైన రిజల్ట్స్​లో 409 మార్కులతో 1,67,839 ర్యాంకు సాధిం చింది. సూరారంలోని మల్లారెడ్డి మెడికల్​కాలేజ్​ఫర్ ఉమెన్స్​లో సీటు లభించింది. కానీ ఎంబీబీఎస్​ చదవడానికి ఏడాదికి రూ.1.70 లక్షలు అవసరం అవుతున్నాయి. ఇందులో రూ.లక్ష హాస్టల్​లో ఉండేందుకు, రూ.30 వేలు లైబ్రరీ ఫీజ్, రూ.50 వేలు అకడమిక్​ పుస్తకాల కొనుగోలుకు అవసరం. ఇలా ఐదేళ్లలో రూ.8.50 లక్షలు అవసరం కానున్నాయి. కానీ ప్రీతి తల్లి వద్ద అంత డబ్బు లేదు. భర్త క్యాన్సర్​ట్రీట్మెంట్​కోసం గతంలో రూ.4 లక్షల వరకు అప్పు చేసింది. బిడ్డను ఎంబీబీఎస్​ చదివించే స్తోమత లేక పెండ్లి చేయాలని అనుకుంటోంది. దీంతో తన చదువు మధ్యలోనే ఆగిపోతుందని ప్రీతి ఆందోళన చెందుతోంది. దాతలు ఆర్థిక సాయం చేసి ఎంబీబీఎస్​ చదివేందుకు చేయూత అందించాలని కోరుతోంది. ప్రీతి అకౌంట్​నంబర్​40723178075, ఐఎఫ్​ఎస్​సీ: SBIN0020608.