
రుతుపవనాలు.. తెలంగాణలో మరింత విస్తరించాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీంతో రాష్ట్రలో పలు జిల్లాలో జోరువానలు కురుస్తాయని చెప్పింది.
వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు భారీ వర్షసూచన చేసింది. దక్షిణ ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాలకు తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. 2024, జూన్ 8వ తేదీ సాయంత్రం హైదరాబాద్ కి ఉరుములు, మెరుపులతో పాటు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు
ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు కురుస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి మేఘావృతమై వాతావరణం చల్లబడి చిరుజల్లులతో వర్షం మొదలైంది. సిటీలోని అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.