దళితబంధుకు త్వరలోనే మరిన్ని నిధులు

దళితబంధుకు త్వరలోనే మరిన్ని నిధులు

గతంలో ప్రకటించినట్టుగా దళితబంధు అమలుచేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ లోని నాలుగు మండలాల పరిధిలో అందరికి దళితబంధు సాయం అందేలా చూడాలని ఆదేశించారు. దళితబంధుపై క్యాంప్ ఆఫీస్ లో రివ్యూ చేసిన ఆయన.. త్వరలోనే మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. హుజురాబాద్ బై పోల్ టైంలో ఈసీ ఆదేశాలతో దళితబంధును తాత్కాలికంగా నిలిపేశారు. ఎలక్షన్ కోడ్ ముగిశాక నవంబర్ 4 నుంచి స్కీం అమలు చేస్తామని సీఎం చెప్పారు. కానీ అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేస్తామని చెప్పారు.