నాలుగున్నర కోట్ల మంది టీనేజర్లకు అందిన ఫస్ట్ డోస్

నాలుగున్నర కోట్ల మంది టీనేజర్లకు అందిన ఫస్ట్ డోస్

దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేగంగా చేపడుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 165 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

దేశవ్యాప్తంగా ఇవాళ సాయంత్రం ఏడు గంటల వరకు 53 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త డోసు (ప్రికాషనరీ/బూస్టర్ డోసు) వ్యాక్సినేషన్‌ను జనవరి 10 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫ్రంట్‌ లైన్ వర్కర్లు, హెల్త్ సిబ్బంది, కోమార్బిడ్ కండిషన్లతో ఉన్న 60 ఏండ్ల పైబడిన వృద్ధులకు ముందుగా ఈ బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా వేగంగా సాగుతోందని కేంద్ర ఆర్యోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో కోటి 16 లక్షల మందికి పైగా బూస్టర్ డోసు ఇచ్చినట్లు పేర్కొంది. 

ఇక 15 నుంచి 18 ఏండ్ల మధ్య వయసున్న టీనేజర్లకు జనవరి 3 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 4.5 కోట్ల మందికి పైగా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం ద్వారా దేశ భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

బీజేపీ నేత హత్య: నిందితుల్ని పట్టిస్తే రూ.2.5 లక్షల నజరానా

ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు!