Cricket World Cup 2023: బాబోయ్ ఈ టీం నాకొద్దు.. పాక్ బౌలింగ్ కోచ్ పదవికి మోర్కెల్ రాజీనామా

Cricket World Cup 2023: బాబోయ్ ఈ టీం నాకొద్దు.. పాక్ బౌలింగ్ కోచ్ పదవికి మోర్కెల్ రాజీనామా

వరల్డ్ కప్ లో లీగ్ దశతోనే సరిపెట్టుకున్న పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ పదవికి మోర్నీ మోర్కెల్ రాజీనామా చేసినట్లు పాక్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ మాజీ దక్షిణాఫ్రికా పేసర్ ఈ ఏడాది జూన్‌లో ఆరు నెలల ఒప్పందంపై పాకిస్థాన్ జట్టులో చేరాడు. మోర్కెల్ బౌలింగ్ కోచ్ గా సంతకం చేసిన తర్వాత పాక్ తన తొలి సిరీస్ ను లంకపై ఆడింది.   

మోర్కెల్ స్థానంలో ఎవరిని నియమిస్తారనే విషయం పాక్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. మోర్కెల్ బౌలింగ్ కోచ్ గా పాక్ ఘోర  ప్రదర్శన చేసింది. ఆసియా కప్ లో ఫైనల్ కు చేరడంలో విఫలమైన పాక్.. వరల్డ్ కప్ లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. దీంతో పాక్ జట్టు కోచ్ పదవికి గుడ్ బై చెప్పేశాడు. మోర్కెల్ అంతర్జాతీయ క్రికెట్ లో దక్షిణాఫ్రికా తరపున 86 టెస్టుల్లో 309 వికెట్లు, 117 వన్డేల్లో 188 వికెట్లు పడగొట్టాడు. 2006 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ స్పీడ్ స్టార్ 2018 లో తన చివరి టెస్ట్ మ్యాచ్ తో ఇంటర్నేషనల్ టీంకు గుడ్ బై చెప్పాడు.     

ALSO READ :- శకునం చెప్పే బల్లి : డేటింగ్ యాప్ ట్రాప్ లో పడ్డ జర్నలిస్టు.. డబ్బులు మాయం

కాగా.. ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ 9 మ్యాచ్ ల్లో 4 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది. భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌పై ఓడిపోయినా ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో అనూహ్య పరాజయం ఆ జట్టు సెమీస్ అవకాశాలను దెబ్బ తీసింది. పాక్ తన తదుపరి సిరీస్ ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆస్ట్రేలియాలో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ డిసెంబర్ 14 నుంచి జనవరి 7 వరకు జరుగుతుంది.