గాన కోకిల అంత్యక్రియలు పూర్తి

గాన కోకిల అంత్యక్రియలు పూర్తి

సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. భారత గాన కోకిల కనుమరుగైపోయింది. ఒక అమృత గాత్రం మూగబోయింది. భారత రత్న, లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. యావత్‌ దేశమంతా ఆమె మరణానికి శోకసంద్రంలో ముగినిపోయింది. భారత ప్రధాని, రాష్ట్రపతి సహా పొరుగు దేశమైన పాకిస్థాన్, నేపాల్‌ దేశాధినేతలు సైతం ఆమెకు సంతాపం ప్రకటించారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

భారత రత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలను ముంబైలోని శివాజీ పార్క్‌లో సైనిక, ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తి చేసింది ప్రభుత్వం. అంతకు ముందు ముంబైలోని ఆమె ఇంటి వద్ద నుంచి మొదలైన అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. భౌతికకాయం శివాజీ పార్క్‌కు చేరుకున్నాక ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. లతా మంగేష్కర్ కుటుంబసభ్యులు సహా ప్రధానమంత్రి, మహారాష్ట్ర మంత్రులు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. సైనిక, ప్రభుత్వ లాంఛనాల మధ్య లత దహన సంస్కారాలను పూర్తి చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ఇండియాలో కొత్త ట్రెండ్.. ఇక ఆ కంపెనీలో వారం వారం జీతం

లతా మంగేష్కర్ చివరిగా పాడిన పాట ఇదే

రోజూ నిద్రలేవగానే లతా దీదీ మొఖమే చూసేవాడ్ని