నవాబ్ పేట, వెలుగు: కోయిలకొండ మండలం కన్నయ్య పల్లి గ్రామానికి చెందిన జ్యోతి(26) తన ఏడేండ్ల వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు సింధు, అనూషతో కలిసి అదృశ్యమైంది. కొండాపూర్ గ్రామానికి చెందిన జ్యోతిని కన్నయ్యపల్లికి చెందిన వడ్డే చిన్నయ్యకు ఇచ్చి వివాహం చేయగా, వారికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
ఆ తరువాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో జ్యోతి పెద్ద కూతురును భర్త దగ్గరే వదిలేసి, ఇద్దరు కూతుళ్లతో 7 ఏండ్ల నుంచి తల్లిగారి గ్రామమైన నవాబుపేట మండలం కొండాపూర్ లో ఉంటోంది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడంతో రెండు రోజుల పాటు వారి ఆచూకీ కోసం వెతికారు. జ్యోతి తల్లి దేవమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు.
