మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన తల్లులు.. చిన్నారులను లాలించిన ఎమ్మెల్యే, ఏసీపీ

మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన తల్లులు.. చిన్నారులను లాలించిన ఎమ్మెల్యే, ఏసీపీ

ఇల్లెందు/హుజూరాబాద్ రూరల్, వెలుగు: మున్సిపల్ పోలింగ్​లో భాగంగా బుధవారం ఇద్దరు తల్లులు ఓటేసేందుకు తమ చంటిబిడ్డలతో పోలింగ్​కేంద్రాల వద్దకు రాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య, కరీంనగర్​జిల్లా హుజూరాబాద్​ఏసీపీ మాధవి ఆ చిన్నారులను ఎత్తుకొని లాలించారు. ఇల్లెందు 6వ వార్డులోని మామిడి చెట్ల బడి, హుజూరాబాద్​పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో గల పోలింగ్​కేంద్రాల వద్ద వారిని ఓటర్లు ఆసక్తిగా చూశారు. తల్లులు ఓటేసి వచ్చాక ఎమ్మెల్యే, ఏసీపీ చిన్నారులను వారికి  అప్పగించారు.