
గద్వాల, వెలుగు: రాయచూర్–గద్వాల అంతర్రాష్ట్ర రహదారికి రిపేర్లు చేయాలని వాహనదారులు ఆదివారం ధరూర్ మండలం జాంపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాము కట్టిన టాక్స్నైనా వెనక్కి ఇవ్వండి.. రోడ్ నైనా బాగు చేయండి.. అని రాసిన ప్లకార్డులతో ఆందోళన చేశారు.
అంతర్రాష్ట్ర రహదారిపై మోకాల్లోతు గుంతలు పడినా, వాటికి రిపేర్లు చేయడం లేదన్నారు. రోడ్డుపై గుంతలు పడి యాక్సిడెంట్లు జరుగుతున్నాయని వాపోయారు. కృష్ణారెడ్డి, నరసింహులు, రవి, కొండన్న పాల్గొన్నారు.