స్లిమ్ ఈజ్ కింగ్.. ఆకట్టుకుంటున్న ‘మోటొరోలా ఎడ్జ్ 30’

 స్లిమ్ ఈజ్ కింగ్.. ఆకట్టుకుంటున్న ‘మోటొరోలా ఎడ్జ్ 30’

స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారి అభిరుచి రోజుకో రకంగా మారుతోంది. ఇప్పుడు స్లిమ్ గా, లైట్ వెయిట్ తో ఉండే ఫోన్ల ను కొనేందుకు జనం మొగ్గు చూపుతున్నారు. స్టైలిష్ లుక్ ఉన్న ఫోన్ చేతిలో ఉంటే, పది మందిలో  తమ ఇంప్రెషన్  మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అటువంటి ఫోన్ల కోసం మార్కెట్లో భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఈ కోవకు చెందిన వినియోగదారుల కోసమే ఇటీవల మోటొరోలా కంపెనీ ఓ ప్రత్యేక 5జీ ఫోన్ ను విడుదల చేసింది. దాని పేరే ‘మోటొరోలా ఎడ్జ్ 30’. ఏప్రిల్ 28న విడుదలైన ఈ ఫోన్ ను చూసి గర్విస్తున్నామని మోటొరోలా కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు ఇండియాలో విడుదలైన స్మార్ట్ ఫోన్లలో అత్యంత తేలికైనది ఇదేనని వెల్లడించింది. దీని బరువు కేవలం 155 గ్రాములేనని పేర్కొంది. ఈ ఫోన్ 6.79 మిల్లీమీటర్ల మందమే (థిక్ నెస్) ఉంటుందని వివరించింది. ఫ్లిప్ కార్ట్ తో పాటు రిలయన్స్ డిజిటల్  స్టోర్లు, దేశంలోని ప్రముఖ మొబైల్ రిటైల్ దుకాణాల్లోనూ దీని విక్రయాలు జరుగుతున్నాయి.

ఫీచర్స్ ఇవే.. 

  • ‘మోటొరోలా ఎడ్జ్ 30’ ధర రూ.25,999. 
  • ఇందులో స్నాప్ డ్రాగన్ 778జీ+ రకానికి చెందిన 5జీ ప్రాసెసర్, 6.55 అంగుళాల డిస్ ప్లే ఉన్నాయి. 
  • నియర్ స్టాక్  ఆండ్రాయిడ్- 12 ఓఎస్ ప్లాట్ ఫామ్ పై ఇది పనిచేస్తుంది. 
  • ఈ ఫోన్ లో మ్యూజిక్ ను ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఇందుకోసం స్నాప్ డ్రాగన్ సౌండ్ సపోర్ట్ తో కూడిన డాల్బీ అట్మోస్ కంప్యాటిబుల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
  • సెల్ఫీలు దిగేందుకు 32 మెగా పిక్సెల్స్ కెమెరా ఉంది. 
  • సాధారణ ఫొటోలను తీసేందుకు 50 మెగా పిక్సెల్స్ హై రెజెల్యూషన్ కలిగిన అల్ట్రా వైడ్ + మ్యాక్రో కెమెరా ఉంది. 
  • ఎక్కువ మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నచోట కూడా సులభంగా వైఫై కనెక్ట్ అయ్యేలా.. ఇందులో వైఫై 6ఈ  ఫీచర్ ఉంది. 

మరిన్ని వార్తలు.. 

జైలుకు ఎవరు పోతారో చూద్దాం

వాట్సాప్ లోనూ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ డౌన్ లోడ్