V6 News

మౌంటెన్ డ్యూకు మహేష్ బాబు ప్రచారం

మౌంటెన్ డ్యూకు మహేష్ బాబు ప్రచారం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కూల్​డ్రింక్స్​ బ్రాండ్ మౌంటెన్ డ్యూ తన యాడ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా ఎంచుకుంది. 400 మి.లీ బాటిల్‌‌‌‌‌‌‌‌ను  రూ.20కే అందిస్తున్నామని ప్రకటించింది.

వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరకే ఇవ్వడం తమ లక్ష్యమని సంస్థ కేటగిరీ హెడ్ అకాంక్ష దలాల్ తెలిపారు. టీవీ, సోషల్ మీడియాలో ఈ ప్రచారాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. యువతను ఈ ప్రచారం ఆకట్టుకుంటుందని ఆకాంక్ష అన్నారు.