నేల కింద పర్వతాలు.. ఎవరెస్ట్ కన్నా పెద్దవట

నేల కింద పర్వతాలు.. ఎవరెస్ట్ కన్నా పెద్దవట

మన భూమి లోపల సువిశాల పర్వతాలు ఉన్నాయట! నేల మీది అత్యున్నత శిఖరం ఎవరెస్ట్ ను తలదన్నే రీతిలో ఉన్న పర్వత పంక్తులను అమెరికాలోని ప్రిన్స్ టన్ వర్సిటీ సైంటిస్టులు భూమిలోపల గుర్తించారు.  600 కిలోమీటర్ల లోతులో(భూప్రావారం/మాంటిల్‌‌‌‌) దుర్భేద్యమైన గుట్టలతో ఈ పర్వతాలు నిండివున్నాయని తెలిపారు.భూమిపైన ఉన్న పర్వతాలకంటే చాలా ‘రఫ్’ అని చెప్పా రు. 1994లో బొలీవియాలో సంభవించిన అతి భారీ భూకంపంపై జరిపిన అన్వే షణలో పర్వతాలు తారసపడినట్లు వివరించారు. ‘వాటిని చూసి మేం ఆశ్చర్యపోయాం. నిజంగా అవి పర్వతాలేననా అనే అనుమానం కలిగింది. క్షుణ్ణంగా పరిశీలించి చూసిన తర్వా తే వాటిని పర్వతాలుగా గుర్తించాం ’ అని రీసెర్చ్ లో పాల్గొన్న సైంటి స్టుల్లో ఒకరు తెలిపారు.

కొన్ని చోట్ల ఈ పర్వత పంక్తులు భూ పటలాన్ని తాకినట్లు  లిపారు. బొలీవియాలో వచ్చిన 8.2 భూకంప తీవ్రతకు ఉత్పత్తి అయిన అతి భీకరమైన షాక్ తరంగాలపై సైంటి స్టులు అధ్యయనం చేస్తున్నప్పుడే భూమి లోతుల్లో ఉన్న పర్వతాలు వీళ్ల కంటబడ్డాయి. భూ ప్రావారంలో ఉన్న పదార్థాల మధ్య జరిగిన రసాయన చర్యల వల్ల ఈ పర్వత పంక్తులు ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. నిరంతర కదలికల వల్ల సముద్ర గర్భంలోని నేల, భూమి లోలోతుల్లోకి వెళ్లి పర్వతాలుగా మారి ఉండొచ్చనీ అభిప్రాయపడుతున్నారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌