
న్యూఢిల్లీ: ఐటీ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ సంస్థ మౌరీ టెక్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా రూ. 1,500 కోట్లు సేకరించడానికి సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను మరోసారి అందజేసింది. కంపెనీ సెప్టెంబర్ 2024లోనూ పేపర్లను సమర్పించినా, డిసెంబర్‌లో ఎటువంటి కారణం వెల్లడించకుండానే వాటిని వెనక్కి తీసుకుంది. ఈ ఏడాది మే ఐదున దాఖలు చేసిన తాజా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం.. మౌరీ టెక్ కొత్త షేర్లను అమ్మడం ద్వారా రూ.250 కోట్లు సేకరించాలని ప్రతిపాదించింది.
ఓఎఫ్ఎస్విధానంలో ప్రమోటర్లు రూ.1,250 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయిస్తారు. ప్రమోటర్లు - సుజయ్ , అనిల్ రెడ్డి వరుసగా రూ.726.30 కోట్లు, రూ.370.60 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేస్తారు. పాత వాటాదారుడు - శ్రీనివాసరావు రూ.153.10 కోట్ల విలువైన షేర్లను అమ్మనున్నారు. కంపెనీ రూ.50 కోట్ల వరకు ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా సేకరించవచ్చు.