ఆకుల లలిత కవితకు కోవర్టు

ఆకుల లలిత కవితకు కోవర్టు
  • అర్బన్​లో మున్నూరు కాపు ఓట్ల చీల్చేందుకు పన్నాగం
  • డీఎస్​ కు రావాల్సిన ఎమ్మెల్సీ పదవిని లలిత డబ్బుతో కొనుక్కుంది 
  • ఎంపీ అర్వింద్​

నిజామాబాద్, వెలుగు : అర్బన్​ నియోజకవర్గంలో మున్నూరు కాపు ఓట్లను చీల్చి ఎన్నికల్లో లాభపడడానికి ఎమ్మెల్సీ కవిత పెద్ద కుట్రకు తెరలేపారని ఎంపీ అర్వింద్​ ఆరోపించారు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డితో మాట్లాడి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలితను కాంగ్రెస్​లోకి పంపుతున్నారని అన్నారు. మున్నూరు కాపు సంఘానికి జీవిత కాల గౌరవాధ్యక్షుడైన డీఎస్​ను మోసగించిన ఆకుల లలిత, ఇప్పుడు ఆయన కొడుకు సంజయ్​ కు టికెట్ ​రాకుండా ప్రయత్నిస్తున్నారన్నారు. మంగళవారం అర్బన్ సెగ్మెంట్​లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల మీటింగ్​లో ఆయన మాట్లాడారు.

గతంలో డీఎస్​కు వచ్చే ఎమ్మెల్సీ పదవిని దిగ్విజయ్​సింగ్​కు డబ్బులిచ్చి ఆకుల లలిత తెచ్చుకున్నారన్నారు. మున్నూరు కాపు ఓట్లను చీలనీయొద్దని, బీజేపీకి వేయాలన్నారు. కులమతాలకు అతీతమైన సమర్థుడిని అర్బన్​లో బరిలో నిలుపుతామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, పల్లెగంగారెడ్డి, స్రవంతిరెడ్డి, ధనపాల్​ సూర్యనారాయణ, వెంకటరమణి తదితరులు ఉన్నారు.

ఎన్నికల ముగేసే దాకా ఇక్కడే.. 

అసెంబ్లీ ఎలక్షన్లు ముగిసే వరకు లోక్​సభ నియోజకవర్గం దాటనని, బీజేపీ బూత్ ​కార్యకర్తలు కూడా బూత్​దాటి ఎటూ వెళ్లొద్దని ఎంపీ అర్వింద్​ కోరారు. బాల్కొండ మండలం మోర్తాడ్​లో ఆయన కార్యకర్తల మీటింగ్​లో మాట్లాడారు. మంత్రి ప్రశాంత్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అవినీతి, కమీషన్లు, గంజాయి సరఫరాకు అడ్డాగా మారిందన్నారు. ఓటు వేసే అవకాశం మరోసారి వచ్చిందని, బీజేపీని బలపరచాలన్నారు. పసుపు బోర్డు తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్నానన్నారు. ఏలేటి మల్లికార్జున్​రెడ్డి, నిమ్మల శ్రీనివాస్, మల్కన్నగారి మోహన్, పద్మ పాల్గొన్నారు.