కేసీఆర్‌‌‌‌ హామీలపై ప్రశ్నిస్తాం

కేసీఆర్‌‌‌‌ హామీలపై ప్రశ్నిస్తాం

నిజామాబాద్, వెలుగు: తొమ్మిదేళ్ల కింద ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఇప్పటి పర్యటనలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జవాబు ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ‘జనతా కో జవాబ్ దో..’ పేరిట బహిరంగ సభను నిర్వహించనుంది. సభ ఏర్పాట్లను ఎంపీ స్థానిక లీడర్లతో కలిసి శుక్రవారం పరిశీలించారు.  ఈ సందర్భంగా ఎన్నికల హామీలపై అర్వింద్​ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు. కలెక్టరేట్ పూర్తయి వర్షాలకు నీళ్లలో మునిగి తేలిన రెండేళ్ల తర్వాత ప్రారంభించేందుకు సీఎం వస్తున్నారని ఏద్దేవా చేశారు. ఈ సభ ద్వారా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తన హామీలను గుర్తు చేయనున్నట్లు చెప్పారు. నిజాం షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ వంద రోజుల్లో తెరుస్తామని చెప్పి 9 ఏండ్లు కావస్తుందన్నారు.  ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లెదర్ పార్క్ ఏర్పాటు ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సీడ్ బౌల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తామన్న మాట గుర్తుందా అని ప్రశ్నించారు.  గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ సెల్ ఎటుపోయిందన్నారు. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం, సాగు భూమి, అమరుల స్మారక చిహ్నం ఏర్పాటు ఏమైందన్నారు. కనీసం అమరుల కుటుంబాల మీద ఉన్న కేసులు ఎత్తేయలేదని విమర్శించారు. తెలంగాణ వర్సిటీతో చికాగో వర్సిటీకి ఒప్పందం ఎటు పోయిందని, మోతెకు వంద శాతం డ్రిప్ ఇరిగేషన్ చేస్తామని, అసెంబ్లీ మాదిరిగా పంచాయతీ కార్యాలయం కట్టిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని అని ప్రశ్నించారు.

రాములు మహారాజ్‌‌‌‌‌‌‌‌ను పరామర్శించిన ఎంపీ
నందిపేట, వెలుగు: ​నందిపేట కేదారీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగి రాములు మహరాజ్‌‌‌‌‌‌‌‌ తల్లి మంగి లక్ష్మమ్మ ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే.. విషయం తెలుసుకున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఆయనను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంపీ వెంట మండల పార్టీ అధ్యక్షుడు భూతం సాయరెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారంపల్లి గంగాధర్ ఉన్నారు.