తుమ్మలతో ఎంపీ బలరాం నాయక్​ భేటీ

తుమ్మలతో ఎంపీ బలరాం నాయక్​ భేటీ

భద్రాచలం/ దమ్మపేట వెలుగు :  రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మహబూబా​బాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్​ బుధవారం దమ్మపేట మండలం గండుగులపల్లిలో భేటీ అయ్యారు. మహబూబా​బాద్​ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్​ పార్టీ ఇన్​చార్జిగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరించారు. తన గెలుపు కోసం కృషి చేసినందుకు తుమ్మలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి గెలుపులో కీలకపాత్ర పోషించారని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారిని ప్రశంసించారు.

సత్తుపల్లి : ఎంపీ బలరాం నాయక్ తో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు ఎమ్మెల్యే లు సత్తుపల్లి మండల పరిధిలోని పాకలగూడెం ఫాం హౌస్ లో మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ ఎన్నికల్లో విజయోత్సవ సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం సత్తుపల్లి నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్ ​తదితరులు ఉన్నారు.