ఆర్​ఐడీ విద్యాసంస్థలు ఎంతో ఫేమస్​

ఆర్​ఐడీ విద్యాసంస్థలు ఎంతో ఫేమస్​

కొల్లాపూర్, వెలుగు : జ్ఞాన బోధిగా వెలిగిన చరిత్ర రాణి ఇందిరాదేవిది అని ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. మూడు రోజులపాటు జరిగిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, ఆర్ఐడీ విద్యాసంస్థల స్వర్ణోత్సవాలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. కార్యక్రమాలకు ఎంపీ హాజరై మాట్లాడుతూ కొల్లాపూర్ లో రాణి ఇందిరాదేవి పాఠశాల, కళాశాల ఎంతో ఫేమస్​అన్నారు. మూడు తరాల విద్యార్థులను కలిపిన ఖ్యాతి జూపల్లి రామేశ్వరరావుదేనని కొనియాడారు. 

రాణి ఇందిరాదేవి పాఠశాల పునర్నిర్మాణ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు, పారిశ్రామికవేత్త మైహోం సంస్థ చైర్మన్ రామేశ్వరరావుతో కలిసి పాఠశాల సుందరీకరణ పనులను పరిశీలించారు. అనంతరం ఆర్ఐడీ పాఠశాలలో జ్ఞాన బోధ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ భవిష్యత్​లో పూర్వవిద్యార్థుల సంక్షేమ సంఘం ఎన్నో కార్యక్రమాలు చేయబోతుందని, అందుకు డాక్యుమెంటరీ తయారు చేసుకున్నామని తెలిపారు. 

మైహోం చైర్మన్ జూపల్లి రామేశ్వరావు మాట్లాడుతూ సక్సెస్ అనేది మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఉంటుందన్నారు. ఈ ప్రాంత యువకులకు ధైర్యం, చైతన్యం, జ్ఞానం నింపేందుకే అందరం కలిసికట్టుగా పనిచేస్తామని వెల్లడించారు. 

ప్రొఫెసర్ జయరాంరెడ్డి, ప్రొఫెసర్ రాంగోపాల్ రావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు తామంతా పనిచేస్తామని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి  చేస్తామన్నారు. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన మ్యూజిక్ తో అందరినీ అలరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య, కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వరరావు, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.