పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతో వరల్డ్ యునైటెడ్ నేషన్స్ మీటింగ్ లో పాల్గొన్నానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.15 ఏండ్ల తరువాత యునైటెడ్ నేషన్స్ మీటింగ్ కు ఇండియా తరపున తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతుల పై .. ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అంశాలపై చర్చించామన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ.. మా తాత కాక వెంకటస్వామి రిటైర్మెంట్ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ తో జెనీవా (ILO)లో జరిగిన మీటింగ్ లో గళం వినిపించారు. 40 ఏళ్ల క్రితం కాకా పాల్గొన్న మీటింగ్ లో మళ్ళీ నేను పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. అమెరికాతో పాటు దుబాయ్ లో కూడా పర్యటించా. దుబాయ్ వ్యాపార వేత్తలను పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతంలో ప్రాజెక్టులు,కంపెనీ లు పెట్టాలని పెట్టుబడులు పెట్టాలని కోరాను. పెద్దపల్లి నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ,ఉపాధి అవకాశాలు రాబట్టే అంశాల పై చర్చించా. పెట్టుబడులకు మన ప్రాంతం అనువైనది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.
నిరుద్యోగుల కోసం ఇవాళ బెల్లంపల్లి లో మెగా జాబ్ మేళా నిర్వహించాం. సుమారు రెండు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. పెద్దపల్లి పార్లమెంట్ లో మెగా జాబ్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాలని అదేశాలు ఇచ్చాం. రామగుండం ఎయిర్ పోర్ట్ కి లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సర్వే కోసం 40 లక్షలు చెల్లించింది. అతి త్వరలో రామగుండం ఎయిర్ పోర్ట్ కల సహకారం కానుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కేంద్రాని ఒప్పించి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారు అడిగిన ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇప్పిస్తున్నాము. యూరియా కొరత రాకుండా, సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఆర్ఎఫ్సీఎల్ హెడ్ ఆఫీస్ ను రామగుండంకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రామగిరి ఖిల్లా ను టూరిస్ట్ హబ్ గా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. తాజాగా రోప్ వే కూడా శాంక్షన్ అయింది. 5 కోట్ల ఫండ్ తో ఖిల్లాను డెవెలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కన్నాల రైల్వే గేట్ ఫ్లై ఓవర్ నిర్మించడంతో ఆయా చుట్టుపక్కల గ్రామాల కనెక్టివిటీ పెరుగుతుంది. ఫ్లైఓవర్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి రావడంతో కేంద్ర మంత్రులను కలిసి 100 కోట్ల రూపాయల ను మంజూరు చేయించాను. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అని వంశీ తెలిపారు.
