కాశీబుగ్గ, వెలుగు : పురావస్తు ప్రదర్శనశాలను ఖిలా వరంగల్‌కు తరలించాలని వరంగల్ఎంపీ కడియం కావ్య అన్నారు. గురువారం సిటీలోని జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓరుగల్లు కాకతీయుల అపూర్వ శిల్ప సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పురాతన శిల్పకళ, కాకతీయులు శాసనాలు, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నాయని తెలిపారు.
వీటి సంరక్షణ కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. పురావస్తు ఆఫీస్ సంరక్షణ పనులపై ఎంపీ ఆరా తీశారు. శిల్ప సంపదతోపాటు ప్రాచీన నాణేలు, చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించారు. పురావాస్తు శాఖ మ్యూజియం పరిస్థితిలను సంబంధింత ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ డి.బుజ్జీని అడిగి తెలుసుకున్నారు. ఎంపీ వెంట పురావస్తు శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.
