నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు ఆలయం అభివృద్ధిని కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం అయిన వారంలో రోజుల్లో వస్తానన్న కేసీఆర్.. 9 ఏళ్లు గడిచినా రాలేదని తెలిపారు. దేవుడితో అబద్ధమాడటం మంచిది కాదన్నారు. చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ట్రంలో యాదాద్రి తర్వాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో చెర్వుగట్టు ఒకటని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
రెండు వారాలపాటు నిరసనలపై నిషేధం
నోట్లో దాచి బంగారం అక్రమ రవాణా
