పార్టీ పరువు పోతుందని రాఘవను అరెస్ట్ చేయట్లేరు

పార్టీ పరువు పోతుందని రాఘవను అరెస్ట్ చేయట్లేరు

పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాఘవను సాయంత్రంలోగా అరెస్ట్ చేసేలా కేసీఆర్ ఆదేశాలివ్వాలని ఆయన అన్నారు. మీ మనవడికో రూల్.. సామాన్యులకో రూల్ ఉంటుందా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నిందితుడు బాధిత కుటుంబాన్ని కాంప్రమైజ్ చేసే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.

‘కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ అరాచకాలు అందరం చూస్తున్నాం. ఆత్మహత్య నోట్‎లో రాఘవ వల్లే చనిపోతున్నామని రాశారు. రాఘవను కేసులో ఏ2గా పెట్టారు. అడిషనల్ ఎస్పీ రాఘను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. రామకృష్ణ చనిపోయే ముందు తీసుకున్న వీడియోలో సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఇది చాలా బాధాకరం. వెంటనే రాఘవను ఏ1గా మార్చి.. మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారు? హోంమంత్రి  అయితే పేరుకే ఉన్నారు. పార్టీ పరువు పోతుందని ఎమ్మెల్యే , ఆయన కొడుకుని అరెస్ట్ చేయడం లేదు. రాఘవను షూట్ చేయాలని మా డిసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పొడెం వీరయ్య అన్నారు. సాయంత్రం వరకు రాఘవను పట్టుకొని అరెస్ట్ చేయాలి. అసలు రాఘవ పరారీలో ఉన్నాడా? లేక ఉంచారా?’ అని కోమటిరెడ్డి అన్నారు.

For More News..

ముంపు గ్రామాలలో 8 వేల ఓట్లు తొలగింపు

జకోవిచ్ వీసా రద్దు.. ఇప్పటికీ ఎయిర్‎పోర్టులోనే

మా నాన్న ఎంపీటీసీ.. నన్నే ఆపుతారా?