విద్యా వ్యవస్థ బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ మల్లు రవి

విద్యా వ్యవస్థ బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ మల్లు రవి

ఆమనగల్లు, వెలుగు: విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి తెలిపారు. గురువారం ఆమనగల్లు పట్టణంలో రూ.4 కోట్ల సీఎస్ఆర్  నిధులతో నిర్మించనున్న బాలుర వసతి గృహానికి కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణతో కలిసి భూమిపూజ చేశారు.

 ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యా వ్యవస్థ బలోపేతంతోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రూ.200 కోట్లతో యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నారని తెలిపారు. పొల్యూషన్  బోర్డ్  మెంబర్  బాలాజీ సింగ్, ఏఎంసీ చైర్ పర్సన్  గీత నరసింహ, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గుర్రం కేశవులు, మంగ్లీ రాములు, జంగయ్య, విజయ్, శ్రీశైలం, ఖాదర్, శ్రీకాంత్, నాజర్, తహసీల్దార్  లలిత, మున్సిపల్  కమిషనర్  శంకర్ పాల్గొన్నారు.