లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లే: రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికల్లో  బీజేపీకి 150 సీట్లే: రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాక్యలు చేశారు. బీజేపీకి 150 సీట్లు మాత్రమే వస్తాయన్నారు.  ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో అఖిలేష్ యాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడిన రాహుల్.. నేను సీట్లను అంచనా వేయను.  20 రోజుల క్రితం బీజేపీ  180 సీట్లు గెలుస్తుందని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు వారికి 150 సీట్లు వస్తాయని అనుకుంటున్నా. ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. మేము చాలా బాగా పనిచేస్తున్నామని ప్రతి రాష్ట్రం నుంచి రిపోర్టులు అందుతున్నాయని రాహుల్ అన్నారు. 

ఎన్నికల్లో ఇండియా  కూటమి కొత్త ఆశాకిరణమని రాహుల్ అన్నారు. తమ  మేనిఫెస్టోలో పేదరిక నిర్మూలనకు ఎన్నో అంశాలు ఉన్నాయని రాహుల్ చెప్పారు. దేశంలోని రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర అందిన రోజే సంతోషంగా  ఉంటారని చెప్పారు.  రైతులకు  MSP ఇస్తామని ఇండియా కూటమి హామీ ఇచ్చిందన్నారు. రైతుల ఆదాయం పెరిగిన రోజే పేదరికం తొలిగిపోతుందన్నారు.  

Also Read:పోటీ పడే మగాళ్లు ఉన్నారా.. 15 రోజుల్లో.. 3 కోట్ల బీరు బాటిళ్లు తాగారు..

గత 10 సంవత్సరాలలో పీఎం మోదీ పెద్ద నోట్ల రద్దు , GST అమలు, అదానీ వంటి బడా బిలియనీర్లకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉపాధి కల్పన వ్యవస్థను తగ్గించారని విమర్శించారు. ఉపాధిని బలోపేతం చేయడం కోసం తమ మేనిఫెస్టోలో 23 అంశాలను చేర్చామన్నారు.  యువత బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామన్నారు.  పేపర్‌ లీకేజీలకు కఠినమైన చట్టం వేస్తామన్నారు.